షాక్: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత స్వప్న ఆత్మహత్య..!

Divya
టాలీవుడ్ లో తాజాగా విషాద ఛాయలు నెలకొంది.. ప్రముఖ లేడి ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం పోలీసులు విచారించగా ఆమె  ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈమె పనిచేస్తుందట. తన సొంత ఊరు రాజమండ్రి నుంచి గడిచిన మూడు సంవత్సరాల క్రితం తన కలలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ కి ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చిందట.

స్వప్న వర్మ గత ఏడాది నుంచే మాదాపూర్ లో ఉండేటువంటి  తీగల హౌస్ 101  హౌస్ లో ఒంటరిగానే నివసిస్తూ ఉండేదని సమాచారం. అయితే కొన్ని చిత్రాలకు ఈమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన గత ఆరు నెలలుగా ఎటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఈమె ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇలాంటి డిప్రెషన్లు భరించలేక గడిచిన రెండు రోజుల క్రితం తన ఫ్లాట్ లోనే ఈమె ఫ్యాన్ కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాడీ డీకంపోస్ అవ్వడంతో చుట్టుపక్కల దుర్వాసన రావడంతో అక్కడ ప్రజలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా హాస్పిటల్  లో ఈ పని చేసినట్లు సమాచారం. ఇక చుట్టుపక్కల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈమె పైన కేసు నమోదు చేసుకొని పోలీసులు సైతం దర్యాప్తు చేస్తున్నారు.. వీరే కాకుండా గతంలో కూడా స్టార్ సెలబ్రెటీలు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లోకి రావాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాటన్నిటిని నెరవేర్చుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి యువ నిర్మాత మరణ వార్తను ఆమె తల్లిదండ్రులకు చేరవేశారో లేదో ఇంకా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: