ముగిసిన సీఎంల భేటీ.. ఆ ఒక్క అంశమే కీలకమా..?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాదులోని ప్రజాభవన్ లో జరిగింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు,అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో చాలా అంశాలు లేవనెత్తారు.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి వేరుపడినటువంటి కొన్ని మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుకోవడం గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.  ఇందులో ఏడు మండలాలను ఏపీ విభజన చట్టంలో లేకుండానే తీసుకుందని తెలంగాణ సీఎం ఆరోపించినట్లు తెలుస్తోంది. ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. 

అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన ఆస్తులు, టిటిడి బోర్డులో మెంబర్షిప్ తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం 24వేల కోట్ల అప్పు ఉంది అని, అలాగే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం 7వేల కోట్ల అప్పు ఉందని దాన్ని చెల్లించాలని దానిపైన ప్రధాన చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల మేర తెలంగాణ ప్రాంతానికి కూడా హక్కులు కల్పించాలని అడిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా షెడ్యూల్ 9,10 లో ఉన్నటువంటి సంస్థలు వాటి అప్పులు లాభాల వివరాలు కూడా చర్చించినట్లు సమాచారం.  అంతేకాకుండా ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ రెండు చర్చల్లో  చంద్రబాబు హైదరాబాదులో ఉన్న స్థిరాస్తులను ఆంధ్రప్రదేశ్ కు కొన్ని అప్పగించాలని అడిగితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దానికి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.  అలాగే ఆంధ్ర ప్రదేశ్ కి విద్యుత్ బకాయలు ఇవ్వాలని చంద్రబాబు తెలంగాణ సీఎంని అడిగితే దానికి కూడా రేవంత్ రెడ్డి విద్యుత్ బకాయిలు ఇచ్చేదే లేదు అన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించే ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  సీఎంలు ప్రధాన డిమాండ్లు ముందు ఉంచడంతో సమస్యల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు.  

దీంతో ముఖ్యమంత్రులు రాష్ట్రాల నుంచి ఒక కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటి  వేయాలని నిర్ణయం తీసుకున్నారట.  ఇందులో తెలంగాణ నుంచి మంత్రుల కమిటీలో పొన్నం ప్రభాకర్ కు మరియు శ్రీధర్ బాబుకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.  ఈ విధంగా మంత్రులు, అధికారులతో కమిటీ వేసిన తర్వాత సుదీర్ఘ చర్చలు చేసి ఈ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంశాలపై  పూర్తిస్థాయి సమస్య క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: