అభివృద్ధిపై గురిపెట్టిన గురుశిష్యులు.. రాష్ట్రాల దిశ మారుస్తారా.?

Pandrala Sravanthi

-అలనాడు గురు శిష్యులు..
-ప్రజెంట్ ఇరు రాష్ట్రాల సీఎంలు..
- ఒకే జెండా కింద ఎదిగిన వీరు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తారా?

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కారు. ఈ సమయంలో ఆయన ఎన్నో  పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాష్ట్రానికి సంబంధించిన వాటాలు ఏపీతో ఉన్నటువంటి సంబంధాలు ఏవి కూడా ఏనాడు మాట్లాడలేదు. ఈయన మొదటిసారి తెలంగాణకు సీఎం అయిన సమయంలో 2014లో అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. కానీ వీరి మధ్య ఏనాడు కూడా సఖ్యత సరిగ్గా కుదరలేదు.  ఆ తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం జరిగింది. అయినా కేసీఆర్ రెండవ సారి ఇక్కడ గద్దెనెక్కి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రస్తావన చేయలేదు. కానీ 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి రేవంత్ సర్కార్ గద్దెనెక్కింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.  దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు గురు శిష్యులే సీఎంలు అయ్యారు. మరి ఈ ఇద్దరు సీఎంల పరిపాలన లో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయా.. వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉండబోతోంది అనే వివరాలు చూద్దాం..
 చంద్రబాబు రేవంత్ ప్రయాణం:
 2007లో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.  ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీలో చేరిపోయాడు.  అలా 2009లో కోడంగల్ నియోజకవర్గం లో టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలా టిడిపి హయాంలో ఎమ్మెల్యేగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అప్పటినుంచి సీఎం రేవంత్ రెడ్డి మధ్య మరియు చంద్రబాబు మధ్య సత్ససంబంధాలు కొనసాగాయి.  ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2017తెలంగాణ అసెంబ్లీలో కూడా పనిచేశారు. అలా ఉన్న తరుణంలోనే 2018లో ఆయన టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. అలా చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి మధ్య 17 సంవత్సరాల బంధం ఉంది.

ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే చంద్రబాబు ద్వారానే ఈయన పూర్తిగా రాజకీయం నేర్చుకోగలిగాడు అని చెప్పవచ్చు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ గా ఎదిగి  తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇదే తరుణంలో  ఇద్దరు గురు శిష్యుల మధ్య  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి విభజన సమస్యల గురించి పరిష్కారం చేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.  దీనికి అనుగుణంగానే  జూలై 6,2024 రోజున  ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. రాష్ట్రాల డిమాండ్లు, విభజన సమస్యలు, వాటాలు, అప్పులు ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఒక్క రోజుతో కుదిరే పని కాదు. కాబట్టి రెండు రాష్ట్రాల నుంచి మంత్రులవి మరియు అధికారుల కమిటీలు వేసి పూర్తిస్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ సమస్యలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  గురు శిష్యులు ఇద్దరు కలిసి అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: