రేవంత్ - బాబు కలయిక : జగన్, కేసీఆర్ ఇక కనుమరుగేనా?

Veldandi Saikiran
* జగన్‌, కేసీఆర్‌ లకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు
*రేవంత్‌-బాబు చర్చలు సఫలమైతే..2 రాష్ట్రాలు సస్యశ్యామలం


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ... గురువు శిష్యులుగా ముందుకు వెళుతూనే... రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా అడుగులు వేస్తున్నారు. గతంలో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలుగా  ఉన్నప్పటికీ... ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు ఎక్కడ న్యాయం జరగలేదని... పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయని కొంతమంది అంటున్నారు.

కెసిఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మిత్రులుగా ఉన్నప్పటికీ కూడా... పంపకాల విషయంలో చాలాసార్లు వీరిద్దరి మధ్య... అభిప్రాయ బేధాలు జరిగాయట. అయితే ఇప్పుడు ఇద్దరు గురువు శిష్యులు  తెలంగాణ అలాగే ఏపీ లకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇందులో భాగంగానే శనివారం రోజున ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు... పెండింగ్ బకాయిలు, నీళ్లు, నిధులు నియామకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలపై... రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అనంతరం... టీటీడీలో...  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లు కొంతమంది ప్రచారం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఓడరేవులు ఎక్కడ లేవన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ఉన్న ప్రతి ఓడరేవులో... తెలంగాణకు ఏపీ వాటా ఇవ్వబోతుందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొన్ని రోజులు... నడిపించుకునేందుకు ఏపీకి ఫుల్ పర్మిషన్లు రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

అలాగే ఉచితంగా తెలంగాణలో ఏపీ వారికి భవనాలు కూడా ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇలా ఇద్దరు మిత్రులు పంపకాలు జరుపుకున్నట్లు... జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పంపకాలు నిజంగా జరిగితే... రెండు తెలుగు రాష్ట్రాలకు మేలే జరుగుతుంది. అంటే కెసిఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి చేయలేని పనులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు చేసి చూపించబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే నిజమైతే.. తెలంగాణలో మరోసారి రేవంత్ రెడ్డి అటు ఏపీలో చంద్రబాబు  ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: