ఏపీ సిఎం: పింఛన్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల పనులను చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పించిని పెంపు వ్యవహారం కూడా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు చంద్రబాబుకు భారీ సెగ తగలబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పింఛన్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూడా ప్రజల నుంచి కచ్చితంగా ఏపీ సీఎంకు వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. దీంతో ఈ విషయం పైన అటు ఏం చేయాలనే విషయం పైన చంద్రబాబు సన్నగిల్లుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికిపైగా సామాజిక భద్రత పింఛన్లను అందిస్తూ ఉన్నారు. వీరందరికీ వెయ్యి రూపాయలు చొప్పున పెంచిన చంద్రబాబు.. తాను అధికారంలోకి రాకముందే మూడు నెలల నుంచి ముందే చెప్పడంతో అంతా కలిపి ఇస్తానని చెప్పి 7000 రూపాయలను ఈనెల 1వ తారీఖున ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా దీన్ని బట్టి చూస్తే ప్రతినెల 4 వేల కోట్ల రూపాయల వరకు సామాజిక భద్రత పింఛన్లకే అందించాల్సి ఉన్నదట. అంతేకాకుండా ఉద్యోగులకు వేతనాలు రిటైర్మెంట్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వక తప్పడం లేదట.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో 2,50,000 నకిలీ పెన్షన్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీటి పైన ఏపీ ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించారు. ఎవరైనా ఆధార్ కార్డులు వయసు మార్చుకోను కానీ, వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నట్లు, ఒంటరి మహిళా కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వితంతువు కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వారిలో అక్రమంగా ఎవరైనా ఉంటే తొలగించాలని తెలిపారు.

ఇలా అర్హులైన వారందరికీ పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేశారని ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శిస్తోంది. అయితే ఇప్పుడు వీరందరినీ తొలగించడం ద్వారా చంద్రబాబుకు భారం తగ్గుతుందన్నకున్నప్పటికీ.. లబ్ధిదారులు మాత్రం కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. మరి ఇలాంటి విషయంలో చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ పింఛన్ల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: