క‌డ‌ప పార్ల‌మెంట్‌కు జ‌గ‌న్ పోటి.. మొద‌టికే మోసం వ‌స్తుందా.. ?

RAMAKRISHNA S.S.
కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వీరితో ఈ ఐదేళ్లు అసెంబ్లీలో పోరాటం చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఇంకా చెప్పాలంటే జగన్ అసెంబ్లీ గడప తొక్కేందుకు కూడా ఇష్టపడటం లేదని.. జగన్ చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. పైగా వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్ మాట్లాడేందుకు ఈ ఐదేళ్లు మైక్‌ కూడా ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి.. అటు అవినాష్ రెడ్డితో కడప ఎంపీ సీటుకు రాజీనామా చేయించి.. ఉప ఎన్నికల్లో కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది.

ఇటు పులివెందుల అసెంబ్లీ బరిలో తన తల్లి వై.ఎస్. విజయలక్ష్మిని పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇదే జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు జగన్‌ను హెచ్చరిస్తున్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లోనే అవినాష్ రెడ్డి కడప నుంచి కేవలం 50,000 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. బద్వేలు - పులివెందుల అసెంబ్లీ నుంచి వచ్చిన మెజార్టీతో అవినాష్ రెడ్డి గట్టెక్కారు. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం మామూలుగా లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కడప పార్లమెంటుకు పోటీ చేస్తే.. గెలవటం చాలా చాలా కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ తో పాటు అవినాష్ రెడ్డి.. ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే అది పెద్ద రిస్క్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయినా ఇప్పటివరకు జగన్‌కు దూరంగా ఉన్న తల్లి వై.ఎస్. విజయలక్ష్మి ఇప్పుడు జగన్ కోరిక మేరకు తిరిగి పులివెందులలో పోటీ చేస్తుందా..? అన్నది కూడా సందేహమే అని చెప్పాలి. ఏది ఏమైనా జగన్ తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేస్తూ తనపై ఆంధ్రప్రదేశ్ జనాలు పెట్టుకున్న ప్రతిపక్ష నేత అన్న హోదాకు న్యాయం చేస్తూ.. ఐదేళ్లు అసెంబ్లీలో పోరాటం చేస్తేనే గౌరవం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: