చంద్రబాబుపై గుర్రుగా ఆ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. ?

RAMAKRISHNA S.S.
చంద్రబాబు పై టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉండటం ఏంటి.. చంద్రబాబుపై వారికి అంత కోపం ఎందుకు.. ? ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు.. వారు ఎందుకు.. ఇంత కోపంతో ఉన్నారు అనుకుంటున్నారా.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈ ఎన్నికలలో ప‌లువురు సీనియర్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, గురజాల నుంచి య‌రపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నుంచి నక్క ఆనందబాబు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

వీరంతా సీనియర్ నేతలు. పైగా ఆనందబాబు, పుల్లారావు మంత్రులుగా కూడా పనిచేశారు. ఆంజనేయులు, య‌రపతినేని , నరేంద్ర తొలిసారి మంత్రి అవ్వాలని ఎన్నో కలలు కంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఏర్ప‌డే ప్ర‌భుత్వంలో అయినా ఉమ్మ‌డి గుంటూరు జిల్లా నుంచి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే వీరెవరికీ మంత్రి పదవి రాలేదు సరికదా.. ఈ ఐదేళ్లలో కూడా వస్తుందన్న గ్యారెంటీ లేదు. గుంటూరు జిల్లా నుంచి కమ్మ కోటాలో ఇప్పటికీ మంగళగిరి నుంచి నారా లోకేష్, జనసేన కోటాలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్.. అటు కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని చంద్రశేఖర్ ఉన్నారు.

ఇప్పటికే ముగ్గురు కమ్మ నేతలు మంత్రులుగా ఉండగా.. మరో కమ్మ‌నేతకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి కచ్చితంగా రాదని చెప్పాలి. ఈ సమీకరణలు గుంటూరు జిల్లాలో ఉన్న సీనియర్ నేతల మంత్రి పదవి ఆశలకు చెక్ పెట్టేసాయి. ఈ ఐదేళ్లు కూడా తాము కేవలం ఎమ్మెల్యేలుగా మిగిలి పోవాల్సిందే. చంద్రబాబుకు తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన మంత్రి పదవి రాలేదని.. ఈ నేతలంతా కక్కలేక.. మింగలేక.. అన్న‌ చందంగా కోపంతో ఉన్నారట. అయితే చంద్ర‌బాబు కూడా వీళ్ల విష‌యంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఉన్నా చేసేదేం లేదు ఇప్పుడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: