జగన్‌లో పెరిగిపోతున్న ఫస్ట్రేషన్.. ఇలాంటి సెన్స్‌లెస్ కామెంట్స్ నెవర్ బిఫోర్..?

Suma Kallamadi
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. తమ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చాలా కలత చెందారు. అసహనానికీ గురయ్యారు. గత నెల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి అతని అన్ని మీడియా ఇంట్రాక్షన్స్‌లో అతను తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయానన్న కోపంతో ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆయన చేసిన తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అనుచరుల చేతిలో గాయపడిన వైసీపీ మద్దతుదారుడిని ఓదార్చేందుకు కడపలోని రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం లేదని, దీంతో పలువురు చిన్నారులు ఆస్పత్రిలో చేరుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్కూల్ బ్యాగులు అందించడం లేదని, బాబు కక్షపూరిత రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు. ఈ సెన్స్ లెస్ ఆరోపణలను బట్టి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంతా తప్పు జరిగినట్లు చూపించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రభుత్వం పనులను సమర్ధవంతంగా నిర్వహించిందని, అయితే కొత్త ప్రభుత్వం త్వరగా అన్నింటినీ నాశనం చేసిందని అతను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే, అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి జగన్ ఇబ్బందికరమైన రీతిలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అతని ఆరోపణలు, అసంబద్ధమైన ప్రకటనలు నవ్వు తెప్పిస్తున్నాయట. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వారి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. జగన్ హయాంలో జరిగిన అవకతవకలను ఇప్పుడిప్పుడే గుర్తించి, అన్నీ చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వారి నిర్ణయాలపై, విధానాలపై వ్యాఖ్యానించాలంటే జగన్ ఓపిక పట్టాలి.

ఎన్నికల ఫలితాల రోజున ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజల కోసం తనవంతు కృషి చేసినా ఓడిపోయానని జగన్ అన్నారు. అనంతరం ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని సూచించి, తన పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని పరోక్షంగా అంగీకరించలేదు. ఎన్‌డీఎ కూటమి మద్దతుదారులు ఈ ప్రకటనలను అపహాస్యం చేసి ఆయన ఒక కన్నింగ్ లీడర్ అని అభివర్ణించారు.

ఇటీవల, ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేసినందుకు అరెస్టయిన తన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి నేరపూరిత చర్యలను జగన్ సమర్థించారు, ఇది అన్ని వైపుల నుంచి వ్యతిరేకతకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: