వైసిపి: కార్యకర్తలకు గుడ్ న్యూస్.. జయంతి రోజే ప్రకటన..!

Divya
వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందల పర్యటనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన కొంత మంది పార్టీ నాయకుల కార్యకర్తలతో వరుసగా సమావేశాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటమికి గల కారణాలను అడిగిమరీ తెలుసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈ పర్యటనను సైతం ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారమే ఆయన పులివెందులకు చేరుకున్నారు టిడిపి పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన కడప వైసిపి కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు , రాయలసీమ  నేతలతో జగన్ భేటీ కాబోతున్నారు .అలాగే ప్రజాదర్బార్ను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. వైయస్సార్ జయంతి కార్యక్రమాలను సైతం రాష్ట్రవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించాలని ఇదివరకే పార్టీ క్యాడర్ కి జగన్ సూచించారు. పెద్ద ఎత్తున పలు రకాల సేవ కార్యక్రమాలను కూడా చేపట్టాలని  తెలియజేశారు.

అలాగే రక్త శిబిరాలు పాఠశాలలోని పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం ఇతరత్రా వాటి సేవా కార్యక్రమాలను సైతం చేయాలని తెలియజేశారు. ఇక వైయస్సార్ జయంతి సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు జగన్ ఒక తీపి కబురు అందించబోతున్నారని తెలుస్తోంది... అదేమిటంటే వైసీపీ కార్యకర్తలు వారి జీవిత బీమా, ప్రమాద బీమాను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంత మొత్తం అనేది ఇంకా బయటికి రాలేదు కానీ పది లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులను వాలంటరీలను నమ్ముకొని పార్టీ కార్యకర్తలు కింద స్థాయి నాయకులను అసలు పట్టించుకోవడంలేదని మొన్నటి వరకు ఆరోపణలు వినిపించాయి. అందుకే ఓటమిపాలయ్యామా వార్తలు వినిపించడంతో దీని దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఇలా వరాలు కురిపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ టిడిపి పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు కూడా రెండు లక్షల రూపాయలను అందిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: