ఏపీ: తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్.. రెడ్డి వర్సెస్ రెడ్డి..!

Divya
రాయలసీమలోని తాడిపత్రిలో ఇప్పటికి హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున ఆ మరుసటి రోజున చెలరేగిన ఈ అల్లర్లతో అటు జేసి కుటుంబం.. ఇది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పైన పోలీస్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ రెడ్ల కుటుంబాలను తాడిపత్రికి వెళ్ళద్దు అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులను పంపింది. అలా పోలింగ్ మరుసటి రోజు నుంచి ఈ రెండు కుటుంబాలు తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఆఖరికి ఎమ్మెల్యేగా గెలిచిన జేసి అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందట.

ఫలితాలు వెలువడి నెల రోజుల తర్వాత జెసి కుటుంబం మాత్రం తాడిపత్రికి వచ్చినట్టు తెలుస్తోంది.. ప్రభాకర్ రెడ్డి సోదరి మరణంతో జెసి కుటుంబం తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలు సైతం చూస్తున్నారు. అలాగే పెద్దారెడ్డికి కూడా కోర్టు ఆదేశాలు సడలిస్తే ఖచ్చితంగా తాడిపత్రిలోకి ఎంట్రీ ఇస్తారని ఆ నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి.. దాదాపుగా 45 రోజుల తర్వాత జెసి కుటుంబ సభ్యులు తాడిపత్రిలో రావడం జరిగింది.

ఎన్నికల సమయంలో చెలరేగిన ఈ హింసాత్మకమైన ఘటనలు నేపథ్యంలో తాడిపత్రిలో కూడా చాలా చర్చలు విధించారు. అలాగే జేసి దివాకర్ రెడ్డి ,పెద్దారెడ్డి, అస్మిత్ రెడ్డి వంటి వారికి హైకోర్టు బెల్ కూడా పొడిగించింది. తదుపరి ఆధ్వర్యంలో ఇచ్చేవరకు తాడిపత్రికి వెళ్ళవద్దు అని కూడా ఆంక్షలు విధించడం జరిగిందట. జెసి ప్రభాకర్ రెడ్డి సోదరి సుజాత మరణంతో ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డికి బెలుపొడిగిస్తూ జులై 14 వరకు తాడిపత్రిలో ఉండేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పటికీ కూడా తాడిపత్రి ప్రజలు ఒక భయాందోళనాలలో ఉన్నట్లు కనిపిస్తోంది. పెద్దారెడ్డి, జెసి కుటుంబాల మధ్య భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తాడిపత్రిలో మంటలు ఇప్పట్లో చల్లారేలా మాత్రం కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: