వైఎస్సార్ అసలు క్రైస్తవ మతంలోకి ఎందుకు మారారు?

FARMANULLA SHAIK
* జనం మెచ్చిన జన నేత వైఎస్సార్!
* ఆంధ్రప్రదేశ్ కి తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్సార్!
( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): యెడుగూరి సందింటి రాజశేఖర్‌ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఇక వృత్తిపరంగా వైద్యుడైన రాజశేఖర్‌ రెడ్డి.. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నో పదవులు అధిరోహించారు.2004 నుంచి 2009 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పనిచేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్‌... 2009లో కూడా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. అయితే రెడ్డి కులానికి చెందిన వైఎస్సార్ ఇంకా ఆయన ఫ్యామిలీ క్రైస్తవ మతంలోకి ఎందుకు మారారో ఇప్పుడు తెలుసుకుందాం.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్వికులది కడప జిల్లా పులివెందుల తాలూకాలోని బలపనూర. వై ఎస్ రాజశేఖరరెడ్డి ముత్తాత పేరు యెడుగూరి పుల్లా రెడ్డి, ఆయన భార్య పేరు అచ్చమ్మ. పుల్లా రెడ్డి-అచ్చమ్మల కొడుకైన వెంకటరెడ్డికి మొత్తం 10 మంది సంతానం కలిగారు. వారిలో ఐదుగురు కొడుకులు ఇంకా ఐదుగురు కుమార్తెలు. వారిలో ఆరో సంతానంగా రాజారెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాతైన వెంకటరెడ్డి వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. ఆయన మేనమామ చిన కొండారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచి వెంకటరెడ్డి సీస పద్యాలు బాగా రాసేవారు. నిత్యం ఓం నమఃశివాయ అంటూ పంచాక్షరీ మంత్రం జపించేవారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో చదువును మధ్యలోనే ఆపివేశారు. తన తండ్రి పుల్లారెడ్డితో కలిసి వ్యవసాయం చేశారు. ఇక వెంకటరెడ్డి మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో మంగమ్మతో రెండో పెళ్లి జరిగింది. వారిద్దరికీ రాజారెడ్డితో సహా మొత్తం 10 మంది సంతానం కలిగింది.బాగా భారమైన సంతానంతో 1933లో వెంకటరెడ్డి బలపనూరు నుంచి పులివెందులకు వలస వచ్చారు. ఆ సమయంలోనే క్రిస్టియన్ మెషినరీల సహాయంతో ఆయన సంతానాన్ని పోషించుకున్నారు. అలా వైఎస్ రాజశేఖరరెడ్డి తాత తొలిసారిగా కుటుంబంలో క్రైస్తవాన్ని స్వీకరించారు. అలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం క్రైస్తవ మతాన్ని ఆరాదిస్తున్నారు. కానీ హిందూ మతాన్ని కూడా విడిచి పెట్టకుండా హిందూ మతాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: