పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్సార్.. ఇలాంటి మహానేత మళ్లీ పుడతారా?

Reddy P Rajasekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అభిమానించిన రాజకీయ నేతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. వైఎస్సార్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి కాగా ఆయన పేద ప్రజల గుండె చప్పుడుగా నిలిచారు. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్సార్ తన మార్క్ పాలనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని ఆయన అమలు చేశారు.
 
వైఎస్సార్ మన మధ్య లేకపోయినా ఆయన అమలు చేసిన పథకాలు మాత్రం ఇప్పటికీ అమలవుతూ వైఎస్సార్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి. చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలను అమలు చేసిన వైఎస్సార్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు ముందుచూపుతో పరిష్కారం చూపేవారని పొలిటికల్ వర్గాల్లో వినిపించేది. వైఎస్సార్ చేసిన మంచి పనుల గురించి అప్పట్లో కథలుకథలుగా చెప్పుకునేవారు.
 
స్వతహాగా డాక్టర్ అయిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది ప్రాణాలను నిలబెట్టారు. 108 ఆంబులెన్స్ ల ద్వారా వేగంగా ఆపదలో ఉన్నవాళ్లను ఆస్పత్రుల్లో చేరేలా చేసి సరైన సమయంలో చికిత్స అందేలా చేయడంలో వైఎస్సార్ ముఖ్య పాత్ర పోషించారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలను అమలు చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు బాంధవుడిగా పేరు సొంతం చేసుకున్నారు.
 
వైఎస్సార్ ఒక్కరేనని అలాంటి మహానేత మళ్లీ పుట్టరని వైఎస్సార్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంతో పాటు విద్యుత్ బకాయిలను మాఫీ చేసిన వైఎస్సార్ రైతులకు ఉచిత కరెంట్ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, 2 రూపాయలకే కిలో బియ్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఐటీలు ఇలా వైఎస్సార్ అమలు చేసిన పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: