వైఎస్సార్ @ 75: పాదయాత్ర చేసి... కాంగ్రెస్ పార్టీని బతికించిన ధీరుడు?

Veldandi Saikiran

* 2003 చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం
* రైతుల సమస్యలే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైయస్సార్
* పాదయాత్ర దెబ్బకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక
* వైయస్సార్ బాటలోనే జగన్ పాదయాత్ర చేసి సక్సెస్

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి... కెరీర్ మొత్తాన్ని మార్చేసింది ఒకే ఒక పాదయాత్ర. అది 2003 సంవత్సరంలో  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఆ ఒక్క పాదయాత్ర దెబ్బకు ఆయన కెరీర్... అమాంతం పెరగడమే కాకుండా రెండుసార్లు వరుసగా... ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2003 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.

అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కరెంటు కోతలు... రైతులు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సి ఉండేది. ఇటు... బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణం కట్టలేక  ఆంధ్రప్రదేశ్ రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో 2003 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన... పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ కు ఆడబిడ్డగా పిలిచే సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గ చేవెళ్ల నుంచి... వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను  ప్రారంభించడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు లెక్క కడితే... 21 సంవత్సరాలు దాటిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు  అన్ని జిల్లాలను 60 రోజులపాటు కవర్ చేశారు. 1500 కిలోమీటర్లు.... రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం జరిగింది.
పాదయాత్రలో... రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, కనీస మద్దతు ధర లాంటి అనేక హామీలు ఇచ్చి 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రాజశేఖర్ రెడ్డి.  ఇక ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగానే... అన్ని హామీలను అమలుపరిచారు. దీంతో 2009 సంవత్సరంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మహాకూటమి ఏర్పడ్డా కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి సింగిల్ హ్యాండ్ తో కాంగ్రెస్ను గెలిపించారు. ఆ తర్వాత పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాలలో... చాలా కామన్ అయిపోయింది. అందరు లీడర్లు పాదయాత్రను నమ్ముకొని చాలా సక్సెస్ కూడా అయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో  2019 ఎన్నికల్లో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: