ఏపీ: ఉచిత ఇసుక నిర్ణయం లో మరో ట్విస్ట్..!

Divya
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని అందించింది.. అదేమిటంటే ఉచితంగానే ఇసుకని తీసుకొనే సదుపాయాన్ని సైతం కల్పించింది.. ఇసుక విధానంలో డిజిటల్ చెల్లింపు విధానానికి సంబంధించి ఒక అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది. ఎక్కడెక్కడ ఇసుక కేంద్రాలు ఉన్నాయి.. ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుంది. అన్ని వివరాలను కూడా వెబ్సైట్లో ఉంచారు అధికారులు. అయితే ఇసుక సేల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఏ రోజుకి ఆరోజు వివరాలను సైతం మిగిలిన ఇసుక ఎంత ఉంది అనే విషయాన్ని కూడా ప్రతిరోజు అప్డేట్ చేయాల్సి ఉంటుందట.

సోమవారం నుంచి రెండు వారాలపాటు చేతిరాతతోనే బిల్లులను అమలు చేస్తారట. ఆ తర్వాత వే బిల్లులను కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్న సైతం సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానం కూడా అమలు చేసేలా చేస్తున్నారు.. అలాగే రవాణా ఖర్చులు సేంద్రియ ఇసక, ఇసుక తవ్వకాలు ఇలా అన్నిటినీ కూడా పెడతామని తెలియజేస్తున్నారు. అసలు పాయింట్ ఏమిటంటే రవాణాచార్జి కిలోమీటర్ కి ఎంత తీసుకోవాలి.. ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేయాల్సిన పద్ధతి.. మొదట ఉచితమన్నారు.. మినిమం ఫీజు అని చెప్పారు.

ఎంత అనేది ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి.. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లాలి అంటే ఇంత ఖర్చవుతుంది అనే విషయాన్ని.. కిలోమీటర్ కి ఇంత అన్నటువంటిది ఎంత అనే విషయం కూడా కీలకము.. గతంలో జగన్ కూడా ఇలాగే తప్పు చేశారు.. ఇసుక కేవలం 400 రూపాయలు మాత్రమే.. 3000 రూపాయలతో లారీ లోడు అవుతుంది. కానీ అమ్మకానికి వచ్చేసరికి 45 వేల రూపాయలు అయింది. 40 వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుందా.. అది దోపిడి అని చెప్పడం వల్లే.. జగన్ సర్కార్ మీద ప్రజలు విసిగిపోయారు. మరి రేట్ అనేది ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: