జగన్ తండ్రిని ఫాలో అయితే మంచిదా.. అలా చేస్తే మాత్రమే అధికారం దక్కుతుందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే మొదట జగన్ సరైన సలహాదారులను ఎంపిక చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ తన తండ్రిని ఫాలో అయ్యి అందరితో కలిసిపోతూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి విషయంలో కూటమిపై విమర్శలు చేయకుండా వైసీపీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే జగన్ కు మంచిది.
 
గత ఐదేళ్లలో చేసిన ఎన్నో తప్పులు జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సైతం జగన్ ను నిలువునా ముంచేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ తండ్రిని ఫాలో అయితే మాత్రమే అధికారం దక్కే అవకాశం అయితే ఉంది. జగన్ ఐప్యాక్ ను నమ్ముకోకుండా ఉన్నా ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈరోజుకు కూడా ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారంటే ప్రజల మనస్సులో ఆయన స్థానం ఏంటో సులువుగా అర్థమవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైఎస్సార్ అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచే పథకాలుగా మిగిలిపోయాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారనే చెప్పాలి.
 
జగన్ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. కూటమిపై వ్యతిరేకత వస్తే మాత్రమే వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జగన్ రాబోయే రోజుల్లో సరైన దారిలో ముందడుగులు వేస్తారో లేదా కూటమికి పోటీ ఇవ్వలేక వెనుకబడతారో చూడాల్సి ఉంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు చిన్న సమస్యలు అయినా పెద్ద సమస్యలు వాటిని సరైన విధంగా పరిష్కరించుకుంటే మాత్రమే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: