తెలంగాణ:2028 బీజేపీదే..గేమ్ ఛేంజర్ ఈటెలేనా..?
- ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
- బీజేపీలో విలిన దిశగా కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్ పేరు మాత్రమే. ఉద్యమానికి ఊతమూది ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడంలో ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ఆయన కృషికి తోడుగా ఎందరో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఇలా తెలంగాణలోని అన్ని రంగాల వారు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. చివరికి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేసీఆరే సీఎం పీఠాన్ని అధిరోహించారు. మొదటిసారి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్, పేద ప్రజలకు దేవుడయ్యారు. అయితే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బుద్ధి మారింది. కుటుంబ పాలన చేసి రాష్ట్రంలో లీడర్లందరినీ తన గుప్పిట్లో ఉంచుకోవాలని అహంకార భావాన్ని చూపించారు. లీడర్లను గుప్పిట్లో ఉంచుకుంటే పర్లేదు కానీ, రాష్ట్రంలోని ప్రజలను కూడా రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక రాజులా పాలించాడు.
2028 బిజెపి టార్గెట్ :
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తోంది. రాష్ట్రం విపరీతమైన అప్పుల పాలయింది. కాంగ్రెస్ కూడా సాధ్యం కానీ హామీలు ఇచ్చింది. కనీసం కేంద్ర సపోర్ట్ కూడా లేకుండా పోయింది. వారిచ్చిన హామీలను ఐదు సంవత్సరాలపాటు సాగించాలి అంటే సాధ్యం కాని పని. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో మైనస్ అవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైంది. పాలన చేసే సత్తా సామర్థ్యం ఉన్నా, తలకు మించిన అప్పుల వల్ల ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సతమతమవుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బిజెపి పార్టీ పుంజుకుంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 సీట్లు, పార్లమెంటు ఎలక్షన్స్ లో 8 సీట్లు సాధించి తిరుగులేని పార్టీగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు ఉద్యమ నాయకుడు అయినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఒకవేళ రాజేందర్ కు బిజెపి అధ్యక్ష బాధ్యతను ఇస్తే మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది.