కేసీఆర్ పొలిటికల్ కెరీర్ ను కూతురే ముంచేసిందా.. బీఆర్ఎస్ దీనస్థితి వెనుక ట్విస్టులివే!

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన పార్టీగా టీ.ఆర్.ఎస్(బీఆర్ఎస్) పార్టీకి గుర్తింపు ఉండగా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ పొలిటికల్ కెరీర్ ను కూతురే ముంచేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేసీఆర్ కూతురు కవిత పలు కేసుల్లో చిక్కుకోవడం వల్లే ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం పోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
బీఆర్ఎస్ దీనస్థితి వెనుక అసలు కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ పేరు మారిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ జాతకం కూడా మారిపోయింది. టీ.ఆర్.ఎస్(బీఆర్ఎస్) పార్టీ పుట్టుక వెనుక అసలు లక్ష్యాలు వేరు అనే సంగతి తెలిసిందే. ఆ లక్ష్యాలను గాలికొదిలేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అత్యాశ వల్ల కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
కేసీఆర్ విమర్శలు చేసినా ఆ విమర్శలను పట్టించుకునే వాళ్లు సైతం కరువయ్యారు. కవిత నిర్దోషి అని తేలి జైలు నుంచి విడుదలైతే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. మరోవైపు కేటీఆర్ పార్టీపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తే పార్టీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కేసీఆర్, కేటీఆర్ కలిసి సరైన దారిలో అడుగులు వేయకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.
 
లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటకపోవడం పార్టీకి మైనస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ముఖ్యమైన నేతలు పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బీ.ఆర్.ఎస్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మారిపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ పై పజల్లో వ్యతిరేకత పెరిగితే మాత్రమే రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్ కు సానుకూల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: