ఏపీ: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. ఏమి మారలేదా..?
ఆరుల్ ప్రకారం అయితే ఒక లారీ ఇసుక కచ్చితంగా 17వేల రూపాయలకే రావాలి.. కానీ 45 వేల రూపాయల వరకు వెళ్ళింది. ఒక ట్రాక్టర్ ఇసుక 3000 రూపాయలకు 4000 రూపాయలకు రావాలి.. కానీ పదివేల రూపాయల వరకు వెళ్లిందట. జగన్ ఇసుక విధానంలో కచ్చితంగా ఫెయిల్యూర్ గా మిగిలారు.. రాష్ట్రానికి ఆదాయం సంపాదించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కానీ జనాలకు తక్కువ రేటుకు అందించ కలిగి ఉంటే సక్సెస్ అయ్యే వారు. టన్నుకు ఎంత అయితే తను చెప్పారో.. నిజంగా జనానికి వెళ్లి ఉంటే హ్యాపీగా ఉండేవారు.
అది చేయలేకపోయారు.. అప్పుడైనా ఇప్పుడైనా సరే దళారినే దోచుకుంటారు. ఆ దోచుకునే దళారే రాజకీయ నాయకుడు అంటూ పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అది తెలిసి కూడా పరిష్కరించకపోవడం అది దురదృష్టకరమని చెప్పవచ్చు. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇసుకప్ ఉచితమని తెలియజేసినప్పటికీ.. టన్ను పైన ఇంత మొత్తం డబ్బులు అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ధరల విషయం మాత్రం ప్రకటించలేదు. మరి ఏ మేరకు ధరలు ఉంటాయని విషయం పైన ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ చేసిన తప్పు అయితే చంద్రబాబు చేయరు కదా అంటూ పలువురు టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు.