కొడుకా? కూతురా? విచిత్ర పరిస్థితిలో విజయమ్మ?

Purushottham Vinay

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైసీపీలో రాష్ట్ర రాజకీయాలేమో కానీ కుటుంబ రాజకీయాలు మాత్రం అంతుపట్టలేనట్టుగా ఉన్నాయి. వైఎస్.రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు వసుదైక కుటుంబంలాగా కనిపించిన ఆ ఫ్యామిలీ ఆయన చనిపోయాక మాత్రం ఫ్యామిలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.2014 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా జగన్ అన్నకు సపోర్ట్ గా నిలిచారు. ఐతే అప్పుడు పార్టీ మాత్రం ఓడిపోయింది. 2019 లో కూడా వైఎస్ జగన్ కు తోడుగా కుటుంబం అంతా ఉంది. ఐతే గెలిచి అధికారం లోకి వచ్చాక మాత్రం జగన్ లో వచ్చిన  మార్పుని జీర్ణించుకోలేకపోయారు. అలా విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. షర్మిల తెలంగాణాలో రాజన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని సొంత పార్టీ పెట్టింది. ఐతే ఆమె ప్రభావం చూపలేదు కానీ దాని వల్ల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసింది. ఇక విజయమ్మ కూడా రాష్ట్ర రాజకీయాలు తనకు అవసరం లేదని ఫారిన్ కి వెళ్లిపోయింది. ఇక వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసుపై సునీత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.కుటుంబం మొత్తం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాగా ఆ కారణాలు కూడా ఆయన్ని ఓటమికి దగ్గర చేశాయి. 


ఎన్నికల్లో షర్మిల కడప లోక్ సభ నుంచి పోటీ చేయగా విజయమ్మ షర్మిల కోసం వీడియో బైట్ ఇచ్చి ఆమెను ఆశీర్వదించమని కూడా అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి కోసం ఎలాంటి మాటా చెప్పలేదు. ఐతే  వైఎస్సార్ జయంతి నాడు మాత్రం కొడుకు, కోడలితో పాటే ఇడుపులపాయకు ఆమె వచ్చారు. తను కొడుకు పక్షానే ఉన్నానని విషయం అర్ధమవుతున్నా ఎన్నికల్లో షర్మిలకు ఎందుకు వీడియో బైట్ ఇచ్చారన్నది మాత్రం వైసీపి అభిమానులకు అర్ధం కావట్లేదు.ఇక ఎటొచ్చి వెళ్లినా కూడా జగన్, షర్మిల ఇద్దరు తన పిల్లలే కాబట్టి ఒకరిని కాదని మరొకరిని దగ్గరకు తీసుకునే అవకాశం లేదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరిని ఒకచోట చేర్చే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని సార్లు కూతురికి సపోర్ట్ చేస్తుంది. కొన్నిసార్లు కొడుకుకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాని ఇద్దరితో మాట్లాడి కలపాలని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ ఆమె మాట్లాడిన వాళ్లిద్దరూ కలిసే పరిస్థితి లేదేమో అని కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు జగన్ ఇటు షర్మిల మధ్యలో వైఎస్ విజయమ్మ  పరిస్థితి విచిత్రంగా మారింది. మరి వైఎస్ ఫ్యామిలీ మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: