ఏపీ: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ అప్డేట్..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను 20 వేల రూపాయలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.. అన్నట్టుగానే అందుకు తగ్గ కసరత్తులను చంద్రబాబు సర్కార్ ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. త్వరలోనే రైతులందరికీ కూడా తీపికబురుని  ఏపీ ప్రభుత్వం చెప్పుకోబోతోంది అయితే ఇప్పుడు తాజాగా ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో మార్చినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా రైతులకు ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం 7500 అందిస్తోంది. గత ప్రభుత్వం రైతు భరోసా కింద మరో 6000 కలిపి 13,500 ఇచ్చేది.

కానీ ఏకంగా ఈసారి చంద్రబాబు మాత్రం 20 వేల రూపాయలకు పెంచి రైతులను ఆకట్టుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులను రైతులకు వీలైనంత త్వరగా అంది ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈసారి రెండు విడుతలలోనే  ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేకమైన పోర్టల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతుల యొక్క పూర్తి వివరాలను పోర్టల్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

వైసీపీ ప్రభుత్వంలో 49 లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చేవారు. అయితే కేవలం కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందించడం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పెట్టుబడి సహాయంతో పాటు సకాలంలో ఎరువు సాగునీరు నాణ్యమైన విద్యుత్ అందించేలా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారట.. రైతు పెట్టుబడి సహాయం పోర్టల్ లో త్వరలో అందుబాటులోకి వస్తే.. రైతుల వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంతేకాకుండా పాస్బుక్ తో పాటు ఇతరత్రా వివరాలు ఆధార్ కార్డు నెంబర్, అకౌంట్ బుక్ అన్ని సమకూర్చుకోవాలి. అన్నిటిని కూడా సచివాలయ సిబ్బందిని ఊర్లకే పంపించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈనెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.ఈలోపే అన్నిటిని ఖరారు చేసేలా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: