తెలంగాణలో టిడిపి పార్టీ పై.. విజయశాంతి సంచలన ట్విట్..!

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణకు వెళ్లి తెలుగుదేశం పార్టీ బలపడుతుందని అక్కడ అనడం పలువురు నేతలకు అనుమానాలు తీసుకువచ్చేలా చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అయినా విజయశాంతి తెలంగాణలో టిడిపి పార్టీ ఎప్పటికీ బలపడదు అంటూ.. తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామ్యైన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడాలనే విధంగా కుట్రలు చేసే ప్రయత్నం అయితే చేస్తోంది.. బిజెపి పార్టీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆమె విమర్శించింది.

ఒకవేళ ఇక్కడ టిడిపి కనుక మళ్ళీ బలపడితే తిరిగి తెలంగాణవాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్తానానికి కదలడం కచ్చితంగా కాయమవుతుంది అంటు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడాలి అంటూ కూడా ఆమె విమర్శించారు.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి చూసుకోవాలి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవాలని దృష్టితో చంద్రబాబు గారు హైదరాబాదుకి వచ్చారని అందరూ భావించుకుంటున్నారు అంటూ తెలిపింది.. కానీ పార్టీ ప్రయోజనాలు చంద్రబాబు గారి రహస్య జండాగా ఉన్నాయని అనుమానాలు కూడా కలుగుతున్నాయి అనే విధంగా తెలిపింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారి చేసిన ప్రకటన ఎందుకు ఉదాహరణ అంటూ విజయశాంతి ఒక సంచలన పోస్ట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు బిజెపి అధినేత మోది పవన్ కళ్యాణ్ వంటి వారితో కూడా తెలంగాణలో బాగా వేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారని అందుకే గడిచిన కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పర్యటించి మరి బిజెపి నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ విధంగా మాట్లాడడంతో పలు అనుమానాలకు దారి తీసేలా ఉన్నది. మరి విజయశాంతి చేసిన ఈ ట్విట్ కి ఎవరు స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: