ఏపీ: జగన్ ను తెలంగాణ సీఎం తక్కువ అంచనా వేస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక సంచలనంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని ప్రతిపక్షం జీరో అయిపోయింది.. ఇక షర్మిల మాత్రమే పోరాడాల్సింది అంటూ రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరిలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఒక ప్రశ్నార్ధకంగా మారిపోయింది అంటూ తెలిపారు.

ఎన్నికలలో వైయస్సార్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయిందని అయినప్పటికీ 40 శాతం ఓటు బ్యాంకు రావడం జరిగింది.. అయితే ఈ విషయాన్ని రేవంత రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని డామేజ్ చేయాలని ఉద్దేశంతోనే ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షం లేని పార్టీ అంటూ కూడా ఎద్దేవా చేశారు. ముఖ్యంగా జగన్ ను కేసులు చుట్టుముడతాయని ఈ విధంగా హెచ్చరించాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి పలువురు నేతలు తెలియజేస్తున్నారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే అధికారంలోకి రావడానికి పది సంవత్సరాలు పట్టింది అని ఆ తర్వాత పార్టీ పుంజుకొని 66 స్థానాలు గెలిచింది. అని దీన్ని బట్టి ఏ పార్టీకి గెలుపోవటములు సహజమే అన్నట్లుగా తెలుపుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు చాలా కీలకంగా మారనున్నాయి. వైయస్సార్సీపి పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తారని రేవంత్ రెడ్డి ఆశించారని అందుకే ఇలా మాట్లాడాలి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అన్నట్టుగా కూడా తెలిపారు. మరి రేవంత్ రెడ్డి అన్న మాటలను వైసిపి పార్టీ పట్టించుకుంటుందా లేకపోతే ఏంటి అన్న విషయం మరొకొద్ది రోజులలో తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మాత్రం రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేయకూడదని వైసిపి అభిమానులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: