జనసేనాని జనాల గుండెల్లో నిలవాలంటే కష్టపడాల్సిందే?
* నడుం బిగించి జనాలకు జనసేనాని సేవ చేస్తారా?
* జన సేవ చేసి జనాల గుండెల్లో జనసేనాని నిలుస్తారా?
( పిఠాపురం - ఇండియా హెరాల్డ్ ) : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి మొత్తానికి రాజకీయాల్లో గెలిచాడు. తన జన సేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ సీట్లకు రెండింటిలో కూడా విజయం సాధించారు. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో అద్భుతంగా సత్తా చాటారు. ఇప్పుడు కూడా ప్రజలకు దగ్గరయ్యే శాఖలనే తీసుకున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీరు అందించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలన్న టార్గెట్ ని పెట్టుకున్నారు. అంటే ఆయన కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు. పాలనా పరంగా కూడా అదే కమిట్ మెంట్, అదే టార్గెట్ తో పని చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాన్ని జనసేనానితో అనుసంధానం చేసేవే.
గ్రామీణ జన జీవితాలను మార్చే అవకాశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి వచ్చింది.కానీ పవన్ కళ్యాణ్ తనకున్న పేరుని తనకు జనాల నుంచి వచ్చిన పాజిటివిటీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాలి. ఎన్నికల ముందు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు గెలిచాక కూడా అంతే కష్టపడాలి. ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి చెందని ఏరియా. ఎన్నో దశాబ్దాల నుంచి పేదరికంతో మరుగుతున్న ఏరియా. అలాంటి ప్రదేశాన్ని పవన్ ఖచ్చితంగా అభివృద్ధి చెయ్యాలి. లేదంటే ఖచ్చితంగా విమర్శలు ఎదురుకుంటారు. పవన్ మీద జనాలకు అపార నమ్మకం ఉంది. కొంచెం కష్టపడి పవన్ కళ్యాణ్ పిఠాపురంని అభివృద్ధి చేస్తే పవన్ జనాల గుండెల్లో దేవుడతారు. ఒక్క పిఠాపురం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలని కూడా ఆయన వంతుగా పరిష్కరించాలి.ఒక పక్కా తాను కమిట్ సినిమాలకు కూడా న్యాయం చెయ్యాలి. కాబట్టి వీటన్నిటిని మేనేజ్ చెయ్యాలంటే పవన్ ఖచ్చితంగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.