చిన్నమ్మ కష్టం: పురందరేశ్వరిని కెరీర్ నాశనం చేసేందుకు కుట్రలు...?

Veldandi Saikiran

* కేంద్రమంత్రి  పదవి రాకపోవడంతో నిరాశ
* స్పీకర్ పదవి ఇస్తామని దాగా!
* పురందరేశ్వరిలో  టిడిపి, కాంగ్రెస్ మూలాలు
* ఎంపీగా, బిజెపి అధ్యక్షురాలుగా  పదవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...  బిజెపి పార్టీ అధ్యక్షులు పురందరేశ్వరి... పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయింది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలుగా.. పనిచేస్తున్న పురందరేశ్వరి... మొన్న ఎంపీగా కూడా విజయం సాధించారు. సోము వీర్రాజు లాంటి  నేతలను ఎదిరించి రాజమండ్రి టికెట్ సంపాదించుకున్న పురందరేశ్వరి... కూటమి గాలిలో విజయం సాధించారు.
 

వైసీపీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన పురంధరేశ్వరి.. ఎంపీగా విజయం సాధించి  చరిత్ర సృష్టించారు. దీనికి తగ్గట్టుగానే కేంద్రంలో ఇటు ఏపీలో.. nda అధికారంలోకి రావడంతో.. పురందరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ.... పురందరేశ్వరి లాంటి సీనియర్ లీడర్ ను కాదని... అనామక లీడర్ భూపతి శ్రీనివాస కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో పురందరేశ్వరికి.. ఊహించని షాక్ తగిలింది.
 

ఇక లోక్సభ... స్పీకర్ వస్తుందని కూడా.. మొన్నటి వరకు జోరుగా ప్రచారం అందుకుంది. మహిళ ఎంపీగా పురందరేశ్వరి ఉన్న నేపథ్యంలో.. ఆమెకే ఆ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ..  మరోసారి ఓం బీర్లకు స్పీకర్ పదవి దక్కడంతో పురందరేశ్వరి నిరాశకు గురయ్యారు. అది పోయాక... కేంద్రంలో ఏదో ఒక పదవి వస్తుందని... ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.  కానీ... పురందరేశ్వరి మొదటి నుంచి.. బిజెపి లీడర్ కాకపోవడం... పారాషూట్ లీడర్ కావడంతో.. ఆమెకు నిరాశ ఎదురవుతోందట.
 మొదటగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన పురందరేశ్వరి... టిడిపి కి కూడా టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. స్టెబిలిటీ తత్వం పురందరేశ్వరిలో లేదని గ్రహించిన బిజెపి...  పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ భూపతికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అయితే.. పురందరేశ్వరికి.. పదవి రాకుండా సోము వీర్రాజు లాంటి.. లీడర్లు కూడా అడ్డుకుంటున్నారని సమాచారం. మొత్తానికి ఎంపీ పదవితో పురందరేశ్వరి ప్రస్తుతం... అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: