పెద్దిరెడ్డి కష్టం: అష్టదిగ్భందంలో పుంగనూర్ పులి ?
*పుంగనూర్ లో వైసీపీ ఖాళీ
*పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒంటిరి చేసిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. అప్పట్లో కింగులా ఉండేవారు.రాయలసీమ ప్రాంతాన్ని.. ఓ రాజుల ఏలేవారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత...రాయలసీమలో బలమైన నేతగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొనసాగారు. అయితే ఏపీలో.. ప్రభుత్వం మారిన తర్వాత... మాజీ మంత్రి పెద్దిరెడ్డి వరుసగా షాక్ లు తింటున్నారు. పెద్దిరెడ్డి లక్ష్యంగా టిడిపి పార్టీ నేతలు పనిచేస్తున్నారు.
వైసిపి పాలనలో... చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం తో పాటు... రాయలసీమ ప్రాంతాలన్నీ పెద్దిరెడ్డి చేతిలోనే ఉండేవి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని... ఒంటరి చేస్తోంది. టిడిపి కూటమి హవా కొనసాగినప్పటికీ... పెద్దిరెడ్డి గెలవడమే కాకుండా తన కొడుకు మిథున్ రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. అయితే.. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ పెత్తనం... సాగకుండా... పుంగనూరులో టిడిపి... స్కెచ్ లు వేస్తోంది.
అసలు పుంగనూరులోనే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అడుగుపెట్టకుండా... వారిని తిరుపతిలోనే అరెస్టు చేస్తున్నారు. అంతేకాకుండా పుంగనూరు మున్సిపాలిటీ.. టిడిపి కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అందరు కౌన్సిలర్లు...టిడిపి కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి అనుచరులపై... టిడిపి కేసులు పెడుతోంది.
కొత్త ఇసుక పాలసీలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సంబంధించిన... ఇసుక క్వారీలను కూడా సీజ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా పెద్దిరెడ్డిని ఆర్థికంగా, రాజకీయపరంగా దెబ్బ కొడుతోంది టిడిపి.
అయితే.. సహాయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర వైసిపి పార్టీ నేతలను... కలుద్దాం అన్నా... ఆయన కంటే దారుణంగా వారి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఐదు సంవత్సరాల పాటు కింగ్ లో ఉన్న పెద్దిరెడ్డి.. ఇప్పుడు కష్టాల పాలు అవుతున్నారు. నియోజకవర్గ ప్రజలను కూడా కలవలేని పరిస్థితిల్లో... పెద్దిరెడ్డి ఉండిపోయారు. అయితే.. ఈ ఐదు సంవత్సరాల పాటు... ఓపిక పట్టి.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రతాపం చూపిస్తామని పెద్దిరెడ్డి హెచ్చరికలు కూడా ఇస్తున్నారట. అప్పటివరకు గప్చుప్ గా కూర్చుంటామని తెలిపారట.