రెండు పడవలపై ప్రయాణం పవన్ కి కష్టం కానుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి కూడా రాజకీయాలు అంటే చాలా ఇష్టం. దానితో పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించాడు. అలాగే ఎన్నికలకు ముందు ఎన్నో ప్రదేశాలను తిరిగి ఆ పార్టీకి ప్రచారాలను కూడా చేశాడు. ఇక ఎన్నికలలో ఆ పార్టీ అపజయం సాధించడంతో కొంతకాలం తర్వాత చిరంజీవి దానిని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. పవన్ కి అది ఇష్టం లేదు.

ఇక ఆ తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉన్న పవన్ 2014 వ సంవత్సరంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. కాకపోతే ఈ పార్టీ 2014 సంవత్సరం ఎలక్షన్లలోకి దిగలేదు. 2019లో దిగిన బారి ఓటమిని చూసింది. ఇక 2024 లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈయన రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ వచ్చాడు. ఇన్ని రోజుల పాటు పవన్ కి ఏ పదవి లేదు..ఎం ఎమ్మెల్యే కూడా కాకపోవడంతో ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు ఉపముఖ్యమంత్రి అలాగే కొన్ని కీలక మంత్రి పదవులు ఈయన దగ్గర ఉన్నాయి.

ఇంత గొప్ప బాధ్యత కలిగిన ఈయన సినిమాల్లో నటించడం వల్ల ఏదైనా ప్రజా సమస్య వచ్చిన సమయంలో ఆయన సినిమా షూటింగ్లో ఉన్నట్లయితే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక వేళ ఫారన్ షూటింగ్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ నుండి రావడానికి చాలా సమయం పడుతుంది. అంతలోపు ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆయన అందుబాటులో లేనట్లయితే జనాల నుండి తీవ్ర విమర్శలు వస్తాయి. మరి ఇవి మాత్రమే కాకుండా ఆయన ఇటు సినిమాలు , ఇటు రాజకీయాలు రెండు పడవలపై ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కొత్తగా ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఆల్రెడీ మూడు సినిమాలను ఒప్పుకొని ఉన్నాడు. ఆ మూడు సినిమాలు పూర్తి చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక మరి ఆ మూడు సినిమాలు పూర్తి చేసిన తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల పైన దృష్టి పెడతాడా ... లేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా ఈయన అటు సినిమాలు ... అటు రాజకీయాలు రెండింటిలో చురుగ్గా ఉంటాను అంటే మాత్రం ఈయన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: