తెలంగాణ లో టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కే సీ ఆర్ రైతులందరికీ పెట్టుబడి సహాయం కింద సంవత్సరంలో ఎకరానికి 8000 ఇవ్వనున్నట్లు మొదట ప్రకటించాడు. అలాగే ఒక విడత డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి అంటే రైతుకు సరిపోయే అవకాశం లేదు. అందుకే దానిని పది వేలకు పెంచుతున్నాం అని ప్రకటించాడు. ఇలా చెప్పినప్పటి నుండి దాదాపు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం మొత్తం రైతు బంధు సహాయాన్ని రైతులందరికీ పంచుతూ వచ్చింది.
ఇక ఈ పథకంపై తెలంగాణ రాష్ట్రం అంతా ఎంతో హర్షం వ్యక్తం చేసింది. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు మేము కనుక అధికారంలోకి వస్తే సంవత్సరానికి 15 వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాము అని ప్రకటించింది. ఇక అధికారం లోకి రాక ముందు నుండే రేవంత్ రెడ్డి కొంత మంది ప్లాట్ లు చేసుకుని వాటిని అన్ని మరి ఆ భూములపై కూడా రైతు బంధు ను పొందుతున్నారు. అలాగే కొండలు , గుట్టలకు కూడా రైతు బంధు ను పొందుతున్నారు. అలా రైతు బంధు ను పొందుతున్న వారందరిని గుర్తించి అలాంటి వాటిని తీసివేసి నిజమైన రైతులకు , సాగు భూమికి రైతు బంధు కల్పిస్తాం అని చెబుతూ వచ్చాడు. ఇకపోతే తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోచారంలో ఒక సంఘటన ఎదురైంది.
రైతు బంధు ద్వారా పొందిన 16 లక్షల తిరిగి చెల్లించాలని ఎం యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు అందాయి. ఆయన తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్ లుగా మార్చి విక్రయించినప్పటికీ రైతు బంధు పొందారు. అలాగే మండలంలో 30 వేల ఫార్మ్ ల్యాండ్ ఉంటే 66 వేల ఎకరాలకు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి అధికారులు యాదగిరికి నోటీసులు ఇచ్చారు.