ఏపీ: 8 ఏళ్ల బాలిక పై.. గ్యాంగ్ రేప్.. పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తున్న జనం..!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 8 ఏళ్ల బాలిక పైన గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేయడం ఒక సంచలనంగా మారింది. అది కూడా కేవలం ముగ్గురు మైనర్స్ నిందితులుగా ఉండడంతో మరింత ఆందోళనకు ఈ విషయం గురి చేస్తున్నది.. అయితే ఈ విషయం పైన స్పందించిన సింగర్ చిన్మయి బాధితురాలు మూడవ తరగతి చదువుతూ ఉండగా.. నిందితులలో ఒకరు ఆరవ తరగతి మరొకరు ఏడవ తరగతి చదువుతున్నారంటూ ఆమె వెల్లడించింది. ఈ సంఘటన మనలో అందరిని కూడా ఆలోచనలో పడేసేలా చేసిందని స్కూళ్లలో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ నిర్వహించాలి అంటూ ఇప్పుడు ఎమర్జెన్సీ సమయం రానే వచ్చేసింది అంటూ తెలియజేసింది.
ఇకనైనా ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించి అడుగులు వేయాలంటు సింగర్ చిన్మయి సూచించింది. ఈ సంఘటన కల్చర్ బ్రేక్ చేసే విధంగా ఉందనడం వాస్తవం అంటూ కూడా తెలియజేసింది. వీటిపై స్పందిస్తున్న పలువురు నేటిజెన్సు మాత్రం మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం సినిమా వాళ్ళే.. ఇప్పుడు తమను ఏలుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చాలామంది తిట్టిపోస్తున్నట్లుగా సమాచారం.. ముఖ్యంగా ఆన్లైన్లో పోర్న్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో ఉన్నదని అందుకే ఇలా జరుగుతున్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు డిప్యూటీ సీఎం ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి