జగన్ కి సొంత జిల్లాలోనే షాక్.. జంపింగులు మొదలయ్యాయిగా?

praveen
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా బక్క బోర్లా పడిందో అందరికీ తెలిసిందే. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడుతో గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రని అతలాకుతలం చేశారు. సంక్షేమాల పేరిట వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గత ప్రభుత్వానికి మచ్చుకైనా పట్టలేదు. తత్ఫలితంగా వచ్చిన మార్పుకి నిదర్శనమే తాజా ఎన్నికలు. వై నాట్ 175 అన్న వైసిపి గర్వానికి జనాలు 11 తో సరిపెట్టి జగన్ గర్వాన్ని పూర్తిగా అణచివేశారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏమిటంటే... అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దౌర్భాగ్య స్థితిలో ఉన్నది.
అయితే ప్రతిపక్ష హోదా లేని కారణంగా జగన్ ప్రతిపక్ష హోదా కోరిన సంగతి తెలిసిందే. అయితే సభా సంప్రదాయాల ప్రకారం అది వీలు కాదు కాబట్టి జగన్ ఇప్పుడు తాడేపల్లిలో ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయాడు. ఈ క్రమంలో ఉన్న 11 మంది ఉంటారో ఊడుతారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది వైసీపీ క్యాడర్. ఎన్నికల ముందు వరకు ఎగిరెగిరి పడిన వైసీపీ మంత్రులు ఇప్పుడు పిల్లికునలు అయిపోయారు. మరికొందరు గత ఐదు సంవత్సరాలు మిడిసి పడిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఎంతలాగా అంటే వారు తమ ఇల్లు నుంచి బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే అందరి అనుమానాలను నిజం చేస్తూ జగన్ సొంత ఇలాకాలోనే జగన్ కి హార్ట్ ఎటాక్ స్టార్ట్ అయిందంటూ కథనాలు వెలువడుతున్నాయి.
అవును... వాస్తవమే. జగన్ సొంత జిల్లా అయినటువంటి కడపలో జగన్ కి గుబులు మొదలైంది. విషయం ఏమిటంటే రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి త్వరలో టిడిపి పంచన చేరనున్నారు. ఇకపోతే గడప 46వ డివిజన్ కార్పొరేటర్ గా రామచంద్రారెడ్డి సతీమణి శ్రీదేవి కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసినదే. టిడిపి విధి విధానాలకు ఆకర్షితులైన ఈ దంపతులు చంద్రబాబు సాక్షిగా టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుండి వైసిపి వర్గంలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు లేకపోతే వైసిపి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోక మానదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: