కేంద్ర మంత్రి బండిని అలాంటి పని చేయమంటున్న కేటీఆర్.!

Pandrala Sravanthi
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ఏక ధాటిగా పాలించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయి  అనేక ఇబ్బందులు పడుతోంది. నిన్నటికి నిన్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా  ఏపీమంత్రి సత్య కుమార్ తో పెట్టుకుని అభసు పాలయ్యాడు. అలాంటి కేటీఆర్ తాజాగా  కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మరో ట్వీట్ చేశారు.  గత పది సంవత్సరాలుగా బడ్జెట్ లో తెలం గాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోందని తెలియజేశారు.


 ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ తీసుకురావాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తాజాగా కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే ఈ లేఖలో  ఆయన ఇలా రాసుకొచ్చారు.. ఈసారైనా కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ తీసు కురండి. గత పది ఏళ్ల నుంచి తెలంగాణకు బడ్జెట్ లో మొండిచేయి చూపిస్తున్నారు. పవర్లూమ్ క్లస్టర్ గురించి ఇప్పటికి అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం స్వయంగా వచ్చి కేంద్ర మంత్రులను కూడా కలి శామని తెలియ జేశారు.


 కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఈసారి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పవర్లూమ్ క్లస్టర్ తీసుకువస్తే నేతన్నల కష్టాలు తీరిపోతాయని, క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్లే  చేనేత రంగం నిర్వీర్యం అయిపోయిందని,  ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నేతన్నలను ఆదుకోవడంలో ఫెయిల్ అవుతుందని,  కనీసం కేంద్రమైన సిరిసిల్లకు గుడ్ న్యూస్ చెప్పేలా బండి సంజయ్ చేయాలని తెలియజేశారు. ప్రస్తుతం కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాసిన టువంటి బహిరంగ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: