నెల రోజుల పాలనలో బాబు చరిష్మా.. మెగా డీఎస్సీతో మొదలు..
*మెగా డీఎస్సి తో నిరుద్యోగులలో చిగురించిన ఆశలు ..
* రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి కీలక నిర్ణయాలు..
గత ప్రభుత్వంలో ఒక్కఉపాధ్యాయ పోస్టు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.గత ఐదేళ్లుగా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు తలా తోక లేని నోటిఫికేషన్ తో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రకటించింది.అయితే ఈ నోటిఫికేషన్ పై న్యాయపరమైన సమస్యలు రావడంతో పరీక్షలు తేదీలో గందరగోళం నెలకొంది.ఈ లోపు ఎన్నికలు సమీపించడంతో ఎలక్షన్ కమిషన్ పరీక్షలను వాయిదా వేసింది.తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సి ఇస్తామని కూటమి ప్రకటించడంతో నిరుద్యోగులంతా కూటమిని గెలిపించారు.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు 16 ,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటి సంతకం చేసారు.గత ప్రభుత్వం ఇచ్చిన దగా నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు తీసుకున్న నారా లోకేష్ త్వరలోనే డీఎస్సి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డీఎస్సి పై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు ,లోకేష్ ,పవన్ కళ్యాణ్ కు నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.