ఆ మహిళలందరికీ తల్లికి వందనం అమలు.. జగన్ కంటే బాబే బెటర్ అని అంటున్నారుగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేయగా తాజాగా తల్లికి వందనం స్కీమ్ విధి విధానాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. జగన్ అమ్మఒడి పేరుతో అమలు చేసిన స్కీమ్ ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో అమలు కానుంది. అయితే జగన్ కంటే బాబు బెటర్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఏపీలో దారిద్ర రేఖకు దిగువన ఉండి బడికి వెళ్లే పిల్లలున్న తల్లులందరికీ ఈ స్కీమ్ అమలు కానుండగా జగన్ వేర్వేరు కారణాలు చూపుతూ 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాలలో జమ చేయగా చంద్రబాబు మాత్రం 15,000 రూపాయలకు సంబంధించి ఎలాంటి కోతలు లేకుండా అమలు చేస్తున్నారు. జగన్ తో పోల్చి చూస్తే చంద్రబాబు పాలన బెటర్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం దిశగా చంద్రబాబు అడుగులు పడటాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. తల్లికి వందనం స్కీమ్ ను మొదట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేయాలని చంద్రబాబు భావించినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు.
 
మరోవైపు ఆగష్టు నెల 15వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కీలక హామీల అమలు దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. అన్న క్యాంటీన్లతో పాటు మహిళలకు ఫ్రీ బస్ అమలు దిశగా అడుగులు పడనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రబాబు నాయుడు యువతకు మేలు చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ముందడుగులు వేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరగాలని ప్రజలు, అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: