అభివృద్ధి దిశగా ఆంధ్రా.. నెల రోజుల్లోనే చంద్రబాబు ఇంత చేశాడా?

praveen
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీని సాధించిన ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారాన్ని చేపట్టింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనె ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు గడిచింది. అయితే ఈ నెల రోజులలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎంత మేరకు నెరవేర్చారు. దేనిని అమలులోకి తీసుకువచ్చారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే అంతకు ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం లాగానే చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కానీ ఇక వైసిపి ప్రభుత్వం చేయలేకపోయిన పెట్టుబడులను తీసుకురావడం ఉద్యోగాలు కల్పన చేయడం లాంటివి కూడా చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక ఇప్పుడు నెలరోజుల పాలనలో ఆ దిశగా ఎలాంటి అడుగులు వేశారు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఈ నెల రోజుల వ్యవధిలోనే చంద్రబాబు కీలకమైన ముందడుగులు వేశారు అనేది తెలుస్తుంది

 మరి ముఖ్యంగా పెట్టుబడులను రాబట్టడంలో ముందడుగు వేశారు చంద్రబాబు.
* ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపిన చంద్రబాబు భారీగా పెట్టుబడులు తెచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు వేశారు.
* బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధులు భేటీ. రూ.60 వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు. విన్ ఫాస్ట్ అనే ఆటోమెబైల్ సంస్థతోను చర్చలు కూడా జరిపారు. పెట్టుబడుల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.
* పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు విజన్ చూసి భారీగా స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
* ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు, 2026కు ఎయిర్ పోర్టు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
* వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్, పలు అంశాలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్షలు. మంత్రులను ఉరుకులు పెట్టిస్తున్న చంద్రబాబు తనలోని దూకుడును మరోసారి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: