బాబు సీఎం కావడంతో 40 రెట్లు పెరిగిన భూమి విలువ.. అమరావతి స్థాయిని పెంచేశారుగా!

Reddy P Rajasekhar
చంద్రబాబు నాయుడు ముందుచూపు ఉన్న సీఎం అని అందరూ భావిస్తారనే సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయి. అభివృద్ధికే పెద్దపీట వేసే చంద్రబాబు ప్రజారంజక పాలన అందించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ కు బూమ్ పెరిగిందని సమాచారం అందుతోంది.
 
కొన్ని నెలల క్రితం వరకు ఎకరా 20 లక్షలు చెప్పిన భూమి ప్రస్తుతం 8 కోట్ల రూపాయలు చెబుతున్నారంటే అమరావతిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. భూమి ప్రస్తుతం అంత పలకకపోయినా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. బాబు సీఎం కావడం వల్ల నెల రోజుల్లోనే అమరావతిలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
 
రాబోయే ఐదేళ్లలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందేలా బాబు దగ్గర అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని ఆ ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల రాజధానులకు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీడీపీ మరో పదేళ్లు అధికారంలో ఉంటే ఏపీ ప్రజలు కోరుకున్న అభివృద్ధి కచ్చితంగా జరుగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రతిభ ఉన్న నేతలకే మంత్రి పదవులు అప్పగించడంతో అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా మంత్రుల అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో వేర్వేరు రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొనిరావడంలో చంద్రబాబుకు ఆయనే సాటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు విజన్ కు హ్యాట్సాఫ్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చరిత్రను తిరగరాసే లీడర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.   ప్రస్తుత ఏపీ పరిస్థితులకు చంద్రబాబు నాయుడు సరైన లీడర్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: