ఏపీ: చిరంజీవికి చంద్రబాబు అలాంటి బాధ్యతలు ఇచ్చారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడిన తర్వాత మెగా కుటుంబ సభ్యులు చంద్రబాబు ఒక సరికొత్త సర్కార్ తో పరుగులు పెట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇద్దరు మెగా హీరోలను చంద్రబాబు కలుపుకొని మరి ముందుకు వెళుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం తో పాటు సినీ అభివృద్ధిని కూడా చేయాలంటూ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడమని టాలీవుడ్ లో కీలక బాధ్యతలు చిరంజీవికి అప్పగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీకి సినీ పరిశ్రమకు మధ్య బాండింగ్ ని ఏర్పరిచేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని అది కూడా చిరంజీవితో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీన్నిబట్టి చూస్తే చిరంజీవి ఏపీ ప్రభుత్వంలో భాగం కానున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ ప్రచారం అయితే జరుగుతూనే ఉన్నది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు.. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం పైన ఇప్పటికే చాలామంది నిర్మాతలు కలిసినట్లుగా కూడా పవన్ కళ్యాణ్ ను తెలిసిందే.. దీంతో కొంతమంది సినీ పెద్దలు భాగస్వామితో అమరావతిలో ఒక స్టూడియోను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తెలుగు సినీ పరిశ్రమని రాష్ట్రంలో విస్తృతంగా వ్యవహరించాలనే విధంగా చిరంజీవితో ఆంధ్ర ప్రదేశ్ కి సేవలను చేయించాలని ఉద్దేశంతో చంద్రబాబు ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా చిరంజీవి ఉండాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు చిరంజీవిని కోరినట్లుగా సమాచారం. చిరంజీవి చొరవ తీసుకుంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధి చెందుతుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో చిరంజీవి అడుగు వేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.
2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. 2014 ఎన్నికలలో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: