కొత్త మద్యం పాలసీతో మందుబాబులకు మేలు చేస్తున్న బాబు.. ఆ బ్రాండ్లకు చెక్ పెట్టాడుగా!
ఏపీలో వైసీపీ దారుణ పరాజయానికి మందుబాబులు కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. తాము ఖర్చు చేసిన డబ్బుకు నాణ్యమైన మద్యం లభించడం లేదని చాలామంది మందుబాబులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ విమర్శలు రిపీట్ కాకుండా చంద్రబాబు సర్కార్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం కొసమెరుపు. మందుబాబులు మాత్రం బాబుకు ఓటు వేసి మంచి పని చేశామని చెబుతున్నారు.
ఇప్పటికీ గత ప్రభుత్వం అమ్మిన ఊరూపేరు లేని బ్రాండ్ల మద్యం విక్రయిస్తున్నా మంచి మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగడం లేదని తెలుస్తోంది. జగన్ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచివే అయినా మెజారిటీ నిర్ణయాలు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడికి 14 సంవత్సరాలు సీఎంగా అనుభవం ఉండటం కూడా ఆయనకు ప్లస్ అవుతోంది. అనుభవం ఉన్న నేతలకు ఛాన్స్ ఇస్తే ఎంత అద్భుతంగా పాలన అందుతుందో చంద్రబాబు మరోమారు ప్రూవ్ చేస్తున్నారు. కొన్ని షరతులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తూ ఇతర రాష్ట్రాల ప్రజల చేత కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల సీఎంలతో సైతం స్నేహపూర్వకంగా మెలుగుతూ రాష్ట్రం అభివృద్ధి విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.