ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం కామ్ గా ఉంటున్నారు. మొన్నటి వరకు బెంగళూరు వెళ్ళిన జగన్మోహన్
రెడ్డి మళ్ళీ... తాడేపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా
పార్టీ ఓటమిపై విశ్లేషణ చేస్తున్నారు. మళ్లీ ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై కూడా... నేతలతో... సమావేశం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... ఆ
ముఖేష్ అంబానీ ని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి... సిద్ధమయ్యారట.
ముఖేష్ అంబానీ ఇంటికి... జగన్మోహన్
రెడ్డి ఇవాళ వెళ్ళనున్నారు.
ముఖేష్ అంబానీ అలాగే నీతో అంబానీ
రా చిన్న కుమారుడు అనంత్ అంబానీ...
పెళ్లి ఇవ్వాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ
పెళ్లి వేడుకలకు... చాలామంది ప్రముఖులు వస్తున్నారు. వివాహ
వేదిక వద్దకు... అతిధులు వచ్చేందుకు... దాదాపు 100 విమానాలను కూడా ఏర్పాటు చేశారట. అత్యంత గ్రాండ్ గా అనంత అంబానీ వివాహం జరుగుతోంది.
అయితే... ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి కూడా అందింది. దీంతో.. ఇవాళ ఈ వివాహానికి
జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు.
వైసిపి పార్టీ దీనిపై అధికారికంగా ప్రకటించినప్పటికీ... జగన్మోహన్
రెడ్డి సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముఖేష్ అంబానీ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో...
ముఖేష్ అంబానీ సన్నిహితుడికి...
రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు వైఎస్ జగన్.