రెండు తెలుగు రాష్ట్రాలలో... పాదయాత్రలు చేసిన నేతలు ఎంతోమంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొన్నటి నారా లోకేష్ వరకు... చాలామంది తెలుగు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసి సక్సెస్ అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి... 2004 సమయంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సెంటిమెంటును... రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది నేతలు కంటిన్యూ చేస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచిన జగన్మోహన్ రెడ్డి... పాదయాత్ర చేసి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత వైయస్ షర్మిల జగన్ కోసం పాదయాత్ర చేసే సక్సెస్ అయ్యారు. ఇటు... బండి సంజయ్ కుమార్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, నారా లోకేష్ లాంటి వారు కూడా.... పాదయాత్రలు చేసి ఇప్పుడు మంచి పదవులు అనుభవిస్తున్నారు.
అయితే ప్రస్తుతం గులాబీ పార్టీ.. కష్టాల కొలిమిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆఉద్యమ పార్టీని... కాపాడేందుకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుత సమయంలో పాదయాత్ర చేస్తే తప్ప... పరిస్థితి ఎక్కడ కూడా సెట్ అయ్యేలా కనిపించడం లేదట. గతంలో చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు తాను కూడా చేయాలని అనుకుంటున్నారట.
ఇక ఇటు... పాదయాత్ర చేయడం వల్ల మాజీ మంత్రి హరీష్ రావుకు.. చెక్ పెట్టవచ్చని కూడా కేటీఆర్ ఆలోచిస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే తెలంగాణ మొత్తం ఫోకస్ ఆయన పైన పడుతుంది. దానివల్ల హరీష్ రావు... ఎక్కువగా హైలెట్ కాలేడు. అటు పాదయాత్ర చేపిద్దామన్న కేసీఆర్ ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదు. కాబట్టి.. ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీని కాపాడేందుకు పాదయాత్ర చేయాలని... డిసైడ్ అయ్యారట కేటీఆర్.