కొడాలి నానికి పాఠం నేర్పుతున్న నాదెండ్ల మనోహర్?

Suma Kallamadi
గడిచిన ఐదు సంవత్సరాలు ఏపీలో రాజకీయ వ్యవస్థను ప్రజలు ఓ కంట కనిపెట్టారు. దాని ఫలితమే తాజా ఎన్నికలలోని వచ్చిన రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఏ మంత్రులు కూడా తన శాఖకు సంబంధించి ఎటువంటి సమీక్ష జరపడం అనేది జరగలేదు. ఇక అందులో గుడివాడ నియోజకవర్గం నుండి మంత్రిగా ఎన్నిక కాబడ్డ కొడాలి నాని విషయం అయితే వేరే చెప్పనక్కర్లేదు. గత ఐదేళ్ల కాలంలో మనోడు బూతులు తిట్టడం తప్పితే వేరే చేసింది ఏమీ లేదు. ఇక తాజా ప్రభుత్వంలోనే మంత్రులను గాని తీసుకుంటే వారికి వీరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా గోచరిస్తోంది.
ఇక విషయంలోకి వెళితే కూటమి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తనదైన మార్క్ ని తన శాఖకు సంబంధించి ప్రదర్శిస్తుండడం అందరికీ తెలిసినదే. మొన్న మధ్య ఆహార ధాన్యాల గోదాములలోకి ప్రవేశించి వాటిని చెక్ చేసి, క్వాలిటీ విషయంలో రాజీ పడమని వాటిని ఫీజు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి ఘటనలో గత వైసిపి ప్రభుత్వం లో మనకి మచ్చుకైనా కనబడవు. ఇక కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి మంత్రుల గురించి ఇక్కడ ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. వీరంతా అప్పటి ప్రత్యర్థి అయినటువంటి టిడిపిని అదే పనిగా తిట్టడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. అలాంటి నేతలు ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంలోని బొక్కలను వేలెత్తి చూపిస్తే కాస్త కామెడీగా అనిపిస్తుంది.
ఇదే విషయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తూ... కూటమి ప్రభుత్వం కొత్తదైన రాజకీయానికి తెరలేపింది అంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సో కాల్డ్ నాయకులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. దానికి నాదెండ్ల మనోహర్ ని ఉదహరిస్తూ... నేటి తరానికి ఇటువంటి రాజకీయం చేసే నాయకుడే కావాలనే విషయాన్ని బల్లగుద్ది మరి చెబుతున్నారు. మంత్రి అయిన ప్రతి ఒక్కడికి వారి వారి శాఖలో పనిచేయడం అనేవార్యం అని, సమయంలో ఆయా శాఖలపై కొంతమేర నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. అలా కాకుండా ప్రధాన నాయకుడు బటన్ నొక్కుతూ కూర్చుంటే, ఆ తంతును చూసి మిగతా నాయకులు గోలుగిల్లుకుంటూ కూర్చుంటే తాజా ఎన్నికల మాదిరే పార్టీ గల్లంతయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: