తల్లికి వందనం పథకంపై.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ హామీలను ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది . దీంతో అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ సూపర్ 6 హామీలను అమలు చేసే విధంగా పలు రకాల ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 4000 రూపాయల పెన్షన్ ని కూడా అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఒక్కొక్కరికి 15000 చొప్పున తల్లికి వందనం పేరుతో ఎన్నికల ముందు టిడిపి నేత చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.

అయితే ఈ పథకానికి అర్హత రేషన్ కార్డు ఉండాలి ఇంటిలో ఒక్కరికే మాత్రమే వర్తిస్తుంది అంటూ పలు రకాల వార్తలు గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సందర్భంలో ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం స్పందించింది.. ఇప్పటివరకు తల్లికి వందనం పథకం పైన ఏపీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయలేదంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వార్తలు ఎవరు నమ్మవద్దంటూ తెలిపింది.

త్వరలోనే ప్రభుత్వమే అన్ని విషయాలను కూడా తెలియజేస్తుందని ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన పనిలేదు అంటూ కూడా తెలియజేసింది..గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో నగదును తల్లుల ఖాతాలో జమ చేసేవారని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పాఠశాలకు వెళుతున్న కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చేవారని.. అందులో మళ్ళీ ₹1000 వరకు కట్ చేసేవారని మొత్తం మీద 14 లక్షల తల్లుల ఖాతాలో గత ప్రభుత్వం వేసింది.. కూటమిలో భాగంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వర్తిస్తుంది అంటూ చెప్పాము. దీనిపైన జనసేన పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది.. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 ప్రకారం ఒకతల్లికి 15000 అని ఉంది దీనివల్లే గందరగోళం మొదలయ్యింది .త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబోతున్నామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: