అదరగొట్టిన కూటమి? ఆకట్టుకుంటున్న బాబు, పవన్?
• నెల రోజుల్లోనే మంచి పథకాలు అమలు చేసిన కూటమి!
• 30 రోజుల్లో సోషల్ మీడియాలో పాజిటివిటి సంపాదించిన కూటమి!
ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో కొలువుదీరింది.ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ తో సహా అందరు మంత్రులు కూడా రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని పలు పార్టీలు ప్రశ్నించడంతో దీనిపై తాజాగా టీడీపీ స్పందిస్తూ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో 30 కార్యక్రమాలు చేపట్టినట్లు టీడీపీ X వేదికగా తెలియజేసింది. అధికారంలోకి రాగానే మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడం జరిగింది. ఇంకా అలాగే పెన్షన్ల పెంచి ఇంటింటికి వెళ్లి పంచారు. ఇంకా అలాగే ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు, ఉచిత ఇసుక, రూ.70వేల కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి, విజయవాడ తూర్పు బైపాస్ ఇంకా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల, తక్కువ రేట్లకే బియ్యం అలాగే కందిపప్పు అందజేత సహా మరికొన్ని కార్యక్రమాలకు బాటలు వేసింది టీడీపీ ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం ఎన్ఐటి, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం వెసలు బాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులు ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్టులు చదివితే సరిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే కచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఐదు సబ్జెక్టులు చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదవడంతో దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో నారా లోకేష్ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ వెంటనే కల్పించుకొని ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసింది. ఇక ఆ తర్వాత విద్యార్థులు 5 సబ్జెక్టులు చదివినట్టు మెమోలు రూపొందించింది.. ఆ తరువాత వాటిని విద్యార్థులకు అందించి ప్రవేశాలు పొందేలా చేసింది. కూటమి 70 వేల కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడిని సాధించింది. దీనిద్వారా ఎన్నో వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందింది. అందుకు విజయవాడ నగరంలో తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం ద్వారా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. పట్టిసీమ పథకంతో కృష్ణా డెల్టాకు నీళ్ల పంపిణీ మొదలుపెట్టింది. ధరలు బాగా మండిపోతున్న క్రమంలో బియ్యం రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది. ఇలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో సహా మిగతా మంత్రులు కూడా 30 రోజుల్లో తమ పనులు సక్రమంగా చేసి జనాలను ఆకట్టుకున్నారు.