కూటమి పాలన @30: సైలెంట్ దిగుతున్న నాదెండ్ల బులెట్..రేషన్ అక్రమార్కులకు గుబులు ?

Veldandi Saikiran
* రేషన్ అక్రమార్కులకు చెక్
* అవినీతిపై ఉక్కుపాదం
* రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం, పప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన పార్టీ తరఫున... నాదెండ్ల మనోహర్ కు కీలక పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దాదాపు 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న... నాదెండ్ల మనోహర్ కు ఏపీ పౌరసరఫరాల శాఖ  అప్పగించారు. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించిన నేపథ్యంలో.. ఆయన భరతం పట్టేలా  నాదెండ్ల మనోహర్ కు.. పౌరసరఫరాల శాఖనే అప్పగించారు.
వైసిపి పాలనలో.. కాకినాడలో జనసేన పార్టీని చాలా ఇబ్బంది పెట్టారు ద్వారంపూడి.  అందుకే డ్యూటీ ఎక్కిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్  నుంచే... పని ప్రారంభించారు నాదెండ్ల మనోహర్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా... పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా అందేలా...  అధికారులను అలర్ట్ చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా...  రేషన్ బియ్యం సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నారు.
 
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా... అక్రమంగా రేషన్ బియ్యం తరలించిన ప్రజాప్రతినిధులు, అధికారులను టార్గెట్ చేస్తూ... ఉక్కు పాదం మోపారు.  ఇందులో భాగంగానే కాకినాడ పోర్టు నుంచి భారీగా... రేషన్ బియ్యం తరలి వెళ్తుందని గుర్తించారు.  దాని వెనుక ఉన్న వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి... చుక్కలు కూడా చూపిస్తున్నారు నాదెండ్ల మనోహర్.
అక్కడితో ఆగకుండా... తాజాగా ఏపీలో...  సూపర్ మార్కెట్, రైతు బజార్లలో బియ్యం అలాగే కందిపప్పు తక్కువ ధరలో లభించేలా.. యూనిట్స్ కూడా ప్రారంభించారు నాదెండ్ల మనోహర్. తక్కువ ధరకే సన్నబియ్యం...  అటు 160 రూపాయలకే కందిపప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు.. ఇవ్వడంపై కూడా దృష్టి పెట్టారు నాదెండ్ల మనోహర్.  ఇలా తనకు అనుభవం లేని శాఖను కూడా ఏలుతున్నారు నాదెండ్ల మనోహర్. పదవి చేపట్టిన 30 రోజుల్లోనే.. పౌరసరఫరాల శాఖలో సమూల మార్పులు తేగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: