కేసీఆర్ కు విలన్ గా మారిన కేటీఆర్..చీడ పురుగుల్లా చూస్తున్నాడా ?
2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు దానం నాగేందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఉద్యమకారులపై లాఠీ చార్జ్ కూడా చేయించాడని దానం నాగేందర్ పై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి నాయకున్ని కెసిఆర్... దరికి చేర్చుకున్నారు. ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం దిగిపోవడంతో... గులాబీ పార్టీకి ఎసరు పెట్టారు ఉదాహరణ నాగేందర్. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే కాకుండా... ఇతరులను కూడా ఆహ్వానిస్తున్నారు.
అంతేకాకుండా... గులాబీ పార్టీలో కేటీఆర్ పై విమర్శలు చేసి పెను సంచలనానికి తెర లేపారు. గులాబీ పార్టీలో చీడపురుగుల్లా... ఎమ్మెల్యేలను కేటీఆర్ చూశాడని... దానం నాగేందర్ బాంబు పేల్చారు. ఒక ప్రైవేట్ కంపెనీని నడిపినట్లు గులాబీ పార్టీని నడిపాడని.. చురకలాంటించారు. ఇటు కేసీఆర్ మాత్రం... ఒక్క ఎమ్మెల్యేకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదని విమర్శలు చేశారు. అలాంటి పార్టీలో ఉండడం దండగా అంటూ ఫైర్ అయ్యారు.
అతి త్వరలోనే... మరో ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్తారని దానం నాగేందర్ వెల్లడించారు. అంతేకాకుండా గులాబీ పార్టీలో కేవలం ముగ్గురంటే ముగ్గురు లీడర్లు... ఉంటారని... ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని తెలిపారు. దానికి కేవలం 15 రోజుల సమయం ఉందని కూడా బాంబు పేల్చారు దానం నాగేందర్. దీంతో దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.