బాబు సంగతి సరే నువ్వేం చేశావ్ జగన్.. మోసాన్ని షర్మిల బట్టబయలు చేశారుగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ప్రశాంతత లేదనే సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో సొంత పార్టీ నేతలు సైతం ఆ పార్టీని పట్టించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైఎస్ షర్మిల తాజాగా మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.
 
వైఎస్ మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని వైసీపీ విస్మరించిందని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉంచిందని షర్మిల వెల్లడించారు. యూనిఫాంలు, కోడిగుడ్లు, చిక్కీలకు సైతం డబ్బులు చెల్లించలేదంటూ వైసీపీ పై షర్మిల సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలు, గుండాయిజం చేసి ఉండొచ్చని షర్మిల పేర్కొన్నారు.
 
రాజశేఖర్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్టమైన ప్రాజెక్ట్ అని ఐదేళ్లు సీఎంగా పని చేసిన జగన్ ఆ సంస్థను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదని షర్మిల వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ఏమీ తెలియనట్లు ఆయన మాట్లాడారని షర్మిల చెప్పుకొచ్చారు. వైసీపీ తోకపార్టీ అని బీజేపీకి ఊడిగం చేసే ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని షర్మిల వెల్లడించారు.
 
లోక్ సభ స్పీకర్ ఎన్నికలో సైతం జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారని షర్మిల కామెంట్లు చేశారు. జగన్ 2019 ఎన్నికల్లో ప్రతి బిడ్డకూ 15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని నాతో కూడా ఆ మాట చెప్పించారని షర్మిల పేర్కొన్నారు. జగన్ చేసింది మరిచిపోయారేమో అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. అయితే షర్మిల ఎన్ని సీట్లు సాధించిందని ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా షర్మిల సాధించేది లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: