ఆ ఘటనల వల్ల మనోవేదనకు గురైన పవన్.. రిపీట్ కాకుండా జాగ్రత్త పడనున్నారా?
తాను హోం శాఖ తీసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అని పవన్ కళ్యాణ్ ఫీలవుతున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వంగలపూడి అనిత తన బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తిస్తున్నా ఆమెకు ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుండేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పవన్ ఏ శాఖ కోరుకుంటే ఆ శాఖ ఇవ్వడానికి కూటమి సుముఖంగానే ఉందని అయితే పవన్ మాత్రం తనకు నచ్చిన శాఖలను కోరుకున్నారని భోగట్టా.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగదని పవన్ పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు కొంతమంది వైసీపీ నేతలు, అభిమానుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పవన్ సైతం ఆలోచనలో పడ్డారని భోగట్టా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన పవన్ మనస్సును తీవ్రంగా కలచివేసిందని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో చక్కబడిన తర్వాత మాత్రమే సినిమాలకు పూర్తిస్థాయిలో పరిమితం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా తన మార్క్ తో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక మంచి నేతగా మరింత మంచి పేరును సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. జనసేన అధినేత పవన్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.