ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 వ సంవత్సరం విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రెండు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో అనేక ఒప్పందాలను చేసుకున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలు అవుతున్న విభజనలో భాగంగా చేసుకున్న అనేక ఒప్పందాలు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. ఇది ఇలా ఉంటే 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానితో రేవంత్ రెడ్డి తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.
దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా కొనసాగారు. అలాగే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. దానితో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరే ముఖ్యమంత్రులుగా ఉండడంతో చాలా సమస్యలు తీరుతాయి అని చాలా మంది భావించారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే విభజన హామీలకు సంబంధించి కూర్చుని మాట్లాడుకుందాం అని చంద్రబాబు ఒక లేఖను రేవంత్ కి రాయగా ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు.
దానితో వీరిద్దరూ కలిశారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని కోరారు. ఇక దానికి రేవంత్ మీరు దరఖాస్తు పెట్టుకోండి ఆలోచిస్తాం. కాకపోతే మా ఇష్టానికి మేము ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. ఒక వేళ రేవంత్ కనుక చంద్రబాబుకు భవనాలను ఇచ్చినట్లు అయితే పెద్ద స్థాయిలో ఆయన ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్రాన్ని రేవంత్ దోచిపెడుతున్నాడు అని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన చంద్రబాబు కోరికలను పక్కన పెట్టడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.