నాయకులు మారుతున్నారే తప్ప.. ఇరు రాష్ట్రాల భవిష్యత్ మారట్లేదుగా..!!
* రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు
* ఇరు రాష్ట్ర నాయకుల మధ్య కుదరని సయోధ్య
* ప్రజల భవిష్యత్ కు భరోసా వచ్చేది ఇంకెన్నాళ్ళకో ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2 న రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.ప్రత్యేక రాష్ట్రము కోసం ఎంతగానో ఉద్యమించిన తెలంగాణ ప్రజలు అనుకున్నది సాధించారు.వారి పోరాటంలో ఎందరో అమరవీరులు వారి జీవితాలను త్యాగం చేసారు .ఎన్నో ఏళ్లుగా కొట్లాది చివరికి తెలంగాణ సాధించుకున్నారు.అప్పటి కేంద్రంలో వున్న కాంగ్రెస్ విభజన చట్టం సరిగ్గా చేయనందున ఇప్పటికి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు తలెత్తుతున్నాయి.నవ్యాంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ,తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కెసిఆర్ భాద్యతలు స్వీకరించారు.వీరి హయాంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల మధ్య ఎన్నో చర్చలు జరిగాయి.అయితే ఎవరూ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోయారు.ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు వున్నాయి.ఇటు సంపద సృష్టించే రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అవుతుంది.