* హైదరాబాద్ లో పెరుగుతున్న బాబు బ్రాండ్
* తెలంగాణ టీడీపీ మళ్లీ ఊపు
* కేసీఆర్ కు ఆయుధం ఇస్తున్న బాబు
* రేవంత్ పై తెలంగాణ ద్రోహి ముద్ర !
ప్రస్తుతం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో...రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం, అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం... రెండు పార్టీలకు దారుణమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి దోస్తానా చాలా అద్భుతంగా సాగింది.
కానీ...2023 అసెంబ్లీ ఎన్నికల్లో... కెసిఆర్ ఓడిపోవడం,ఇటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం... ఆ రెండు పార్టీలకు తీవ్ర సంక్షోభాన్ని... తీసుకువచ్చాయి. అదే సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవడం... ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా జరిగాయి. రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గతంలో ఇద్దరూ గురువు శిష్యులుగా కొనసాగారు.
చంద్రబాబు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీలోనే రేవంత్ రెడ్డి ఓనమాలు నేర్చుకున్నారు.అలాంటిది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు... కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతలు... కలిసి కెసిఆర్ అటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు.
అయితే వీరిద్దరి ఆలోచనలు ఒకటైనప్పటికీ... చంద్రబాబు చేస్తున్న పనులు మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కెసిఆర్ ఉన్న 10 సంవత్సరాలలో సమైక్యాంధ్రకు చెందిన టిడిపి పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. అసలు చంద్రబాబు పేరు పెద్దగా వినిపించలేదు. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... పాలనలో చంద్రబాబుకు హైదరాబాదులో ఫ్లెక్సీలు కట్టడం, గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరుగుతుంది.
అంతేకాదు తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని చంద్రబాబు ప్రకటించడం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తెస్తున్నాయి. గురువు శిష్యులు ఇద్దరు ఏకమై మళ్ళీ... సమైక్య పాలన తీసుకువచ్చేలా కనిపిస్తున్నారని.. విజయశాంతి అలాగే టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు కొత్త గళాన్ని విప్పుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి సీటుకు.. ఎసరు రావడం ఖాయం అని చెబుతున్నారు.