పవిత్రమైన ప్రదేశాల్లో ఓడిపోతున్న బీజేపీ ఆత్మవిమర్శ తప్పనిసరి..

Suma Kallamadi

బీజేపీ హిందూ మతాన్ని చూపిస్తూ హిందువుల ఓట్లన్నీ తమకే పడేటట్టు చేస్తుంది. ఈమధ్య రామ మందిరం కట్టించి దానివల్లే తమకు ఓట్లు వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరం బుల్డోసర్లతో కూల్చేస్తారు అని ప్రజల మనోభావాలతో మోదీ ఆడుకున్నారని విమర్శలు వచ్చాయి. హిందుత్వ శక్తిని వాడుకోవడానికి మోదీ ట్రై చేస్తున్నారని, ఆయన పాలన బాగోలేదని ప్రజలు ఈసారి భావించినట్లు అర్థమయింది. ఎందుకంటే 400 సీట్లు వస్తాయనుకుంటే 300 మార్కు కూడా దాటలేకపోయింది. ఎన్‌డీఏ కూటమి కాంగ్రెస్ కి మాత్రం 100 పైగా సీట్లు ఎక్కువ వచ్చాయి.
మెజారిటీ బాగా తగ్గిన వేళ బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాని మొత్తం పక్కన పెట్టేసి గెలుపు తమదేననే ఒక ధీమాలో ఉండటం వారికే పెద్ద రిస్క్. బీజేపీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, సోషల్ మీడియా సపోటర్లకు బిజెపి ఎలాంటి సహకారం కూడా అందించడం లేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసే వాళ్లు కూడా సపోర్ట్ చేయడం మానేస్తున్నారు. వారి సొంత పనులు చూసుకుంటున్నారు. పార్టీలో ఉన్న వారికి కూడా ఏమీ లాభం చేయడం లేదని తెలుస్తోంది.
బీజేపీ ఓన్లీ కార్పొరేటర్లకే కోట్లు దోచిపెడుతూ ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి. బీజేపీ వాళ్లు మీడియాను బెదిరించి తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. సాధారణంగా ప్రేమతో తమ కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ బీజేపీ వాళ్లు దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. మొన్న సీట్లు తగ్గడంతో మీడియా వాళ్లు బిజెపి పై అంతకంతకూ పగ తీర్చుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నియోజకవర్గం ఉన్న ఫైజాబాద్ ఎంపీ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అది వాళ్లకి కంచుకోట. అక్కడే ఓడిపోయిందంటే బిజెపిపై ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ స్థానం కూడా బీజేపీ వాళ్లకి కంచుకోట. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ భండారీపై కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా 5,224 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదొక్క చోటే కాదు తమిళనాడు, పంజాబ్‌, రాణిగంజ్, బద్ద మణికంఠ వంటి పవిత్రమైన ప్రదేశాల్లో కూడా బీజేపీ  ఓటమిపాలయ్యింది. ఇన్ని బట్టి చూస్తుంటే హిందుత్వ శక్తిని వారు ఎక్కువ కాలం వాడుకోలేరు అని స్పష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: