పేర్ని నాని: జగన్‌ వల్లే ఓటమి...కార్యకర్తలను రోడ్డున పడేశాడు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఊహించని పరిణామం ఎదురైన సంగతి తెలిసిందే.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. 175 స్థానాలు గెలుస్తామని గర్భంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు...పంగనామాలు పెట్టారు. అటు...పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీలు మాత్రమే గెలిచింది వైసిపి. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... వైసిపిని చిత్రహింసలు పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో వైసీపీ పార్టీ ఓటమిపై..జగన్ అత్యంత సన్నిహితులు, వైసిపి నాయకులు...రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారం కారణంగా.. వైసిపి ఓడిపోయిందని కొంతమంది అంటుంటే..మరికొంతమంది వాలంటీర్ వ్యవస్థ కారణంగా ఓడిపోయిందని చెబుతున్నారు.అయితే తాజాగా  వైసిపి పార్టీ ఓటమిపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విధానాల కారణంగా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రోడ్డున పడ్డారని బాంబు పేల్చారు. ప్రజల కు దగ్గర కావాలని.. జగన్ చాలా విధానాలు తీసుకువచ్చారని... దానివల్ల వైసిపి క్యాడర్ కు అధిష్టానానికి బంధం తెగిపోయిందని వెల్లడించారు పేర్ని నాని.  జాఫర్ షోలో నాని మాట్లాడుతూ... జగన్ వల్ల ప్రజలు నష్టపోలేదని... కానీ ఆయన విధానాల వల్ల ఆ పార్టీ కార్యకర్తలు అలాగే ఇతర నేతలు  తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

ఓటమి బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని వివరించారు.ఓటమి కారణంగా వైసిపి పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. 40 శాతం పైగా ఓటింగ్  తమ సాధించామని తెలిపారు. అయితే వైసిపి పాలనలో సీఎం ఆఫీస్ పనితీరు సరిగా లేదని ఆగ్రహించారు. ఎమ్మెల్యేలకు అలాగే సీఎంఓ కార్యాలయం..అందుబాటులో లేదని...దానివల్ల నియోజకవర్గాలకు నిధులు రిలీజ్ కావడం...జరగలేదన్నారు. వీటన్నిటిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించి...పార్టీని ప్రక్షాళన చేస్తున్నారని వివరించారు. మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. అందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: